ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు….

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్‌పై వైసీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేయడాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడులకు పాల్పడుతోందన్నారు.

అమరావతి, ఏప్రిల్ 07: హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీలు దాడికి దిగడం మీడియా స్వేచ్ఛపై దాడిగా సీఎం అభివర్ణించారు. సొంతంగా మీడియా సంస్థలను నడుపుతూ.. మీడియాను అడ్డుపెట్టుకుని అనైతిక చర్యలకు పాల్పడుతోన్న వైసీపీ.. తమను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతిపై ఆరోపణలు, దూషణలు చేయడం అసంబద్ధం అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో మీడియా సంస్థలపై, ఆంధ్రజ్యోతిపై అనేక వేధింపులకు, కుట్రలకు పాల్పడినా నిబ్బరంగా నిలిచాయి తప్ప భయపడలేదని చంద్రబాబు గుర్తుచేశారు.

ఇలాంటి సైకోలకు సంకెళ్లు, సెంట్రల్ జైళ్లే సరైన ట్రీట్మెంట్: ఏ

అంతరక్షింలోకి న్యుటెల్లా.. ఉచితంగా భారీ పబ్లిసిటీ..

కేసీఆర్‌ను మార్చేసినట్టే.. పినరయి విజయన్‌ను మార్చేస్తారు: రే

డెడ్‌లైన్‌ తర్వాత 4 గంటల్లో ఇరాన్‌లోని పవర్‌ ప్లాంట్లు, బ్రి

వైభవ్ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు: ముంబై కోచ్ పరాస్

23న వేతనంతో కూడిన సెలవు

ఐపీఎల్‌ వల్ల కెరీర్ నాశ‌న‌మైంది… ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స

ట్రంప్ వెనక్కి తగ్గారా.. కెనడా విషయంలో మనసు మార్చుకున్నారా..

ఏబీఎన్‌ సంస్థలపై వైసీపీ దాడులు.. ఖండించిన నేతలు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చ

వచ్చే ఎన్నికల్లో ‘కుక్కర్‌’ పార్టీ ఉండదు

చియా గింజలు ఎప్పుడు తింటే బరువు తగ్గుతారు?

జగన్ రెడ్డి.. జీరో రెడ్డిగా మిగలడం ఖాయం: ఎంపీ కేశినేని శివనా

రౌడీ మూకలను వెంటేసుకుని స్వయంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మీడియా కార్యాలయంపైకి వెళ్లడం వైసీపీ రౌడీ సంస్కృతికి నిదర్శనమని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ దశాబ్దాలుగా కేసులు, దాడులు, ఒత్తిళ్లకు భయపడకుండా పత్రికను, ఛానల్‌ను నడుపుతున్నారన్నారు. దాడులు, నిరసనలు, బెదిరింపులతో మీడియాను భయపెట్టాలనే వైసీపీ రాజకీయాలకు కాలం చెల్లిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అధికారంలో ఉండగా మహిళల పట్ల, సొంత కుటుంబ సభ్యుల పట్ల వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధ్యక్షుడు వ్యవహరించిన తీరును మహిళా సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు. రాజధానిపై వైసీపీ కుట్రలను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతి సంపాదకీయానికి సమాధానం చెప్పలేక.. దాడులు నిరసనలతో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version