లారీని వెనుక నుంచి ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు…

లారీని వెనుక నుంచి ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు.

కోదాడ, నేటి ధాత్రి:

కోదాడ బైపాస్ జాతీయ రహదారి 65 పై శనివారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏలూరుకు వెళ్తున్న ఇంటర్సిటీ ట్రావెల్ ట్రాన్స్పోర్ట్ బస్సు ప్రమాదవశాత్తు ముందు ఉన్న లారీని వెనక నుండి బస్సు బలంగా ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాద సమయంలో బస్సుల మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సు మెయిన్ డోర్ జామ్ అవ్వడంతో అప్రమత్తమై ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడ్డారు. పోలీసుల సమాచారం మేరకు ప్రమాద సంఘటన స్థలానికి చెరుకొని 16 మంది ప్రయాణికులకు గాయాలు అవ్వడంతో కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. బస్సు ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version