గుండెపోటుతో మాజీ గ్రంథాలయ డైరెక్టర్ పుట్టపాక కుమారస్వామి మృతి

గుండెపోటుతో మాజీ గ్రంథాలయ డైరెక్టర్ పుట్టపాక కుమారస్వామి మృతి

పుట్టపాక కుమారస్వామి మృతి పట్ల పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాపం

నర్సంపేట, నేటిధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు పుట్టపాక కుమారస్వామి మృతి పట్ల నర్సంపేట మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వపురం గ్రామానికి చెందిన పుట్టపాక కుమారస్వామి గుండెపోటుతో అకాల మరణం చెందడం పార్టీకి తీరని లోటుగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొని, పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన నాయకుడని కొనియాడారు.మాజీ గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌గా సేవలందించిన కుమారస్వామి సేవలు చిరస్మరణీయమని అన్నారు. వారి మృతి పార్టీతో పాటు వ్యక్తిగతంగా కూడా తీరని లోటుగా భావిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా దివంగతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, భవిష్యత్తులో వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version