నేరాల నియంత్రణలో పోలీస్ వాహనాల కీలక పాత్ర

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీస్ వాహనాల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో వాహనాల పార్కింగ్ మరియు సంరక్షణ కోసం నిర్మించిన నూతన షెడ్‌ను ఎస్పీ మహేష్ బి గితే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు కేటాయించిన పెట్రోకార్ మరియు బ్లూ కోల్ట్ వాహనాలను తనిఖీ చేసి నిర్వహణపై సూచనలు ఇచ్చారు. నేర సమాచారం అందిన వెంటనే ఈ వాహనాల ద్వారా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారని తెలిపారు.

వాహనాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, డ్రైవర్లు వాహనాలను ఎప్పటికప్పుడు కండిషన్‌లో ఉంచాలని సూచించారు. అనంతరం అధికారులు కలిసి షెడ్ పరిసరాల్లో మొక్కలు నాటారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version