బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ ఉంచాలి….

బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ ఉంచాలి?

 

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో వస్తువులు ఉంచే స్థలం చాలా ముఖ్యం. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్‌ను ఎక్కడ ఉంచుతున్నామన్నది దాంపత్య జీవితంపై కూడా ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు..

ఇంటర్నెట్ డెస్క్: బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్‌ను ఎక్కడ ఉంచుతున్నామన్నది కేవలం ఇంటీరియర్ విషయం మాత్రమే కాదు.. అది దాంపత్య జీవితం, కుటుంబ శాంతి, మానసిక ప్రశాంతతపై కూడా ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. డ్రెస్సింగ్ టేబుల్‌ను సరైన దిశలో ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, తప్పు దిశలో ఉంచితే అనవసర సమస్యలు తలెత్తే అవకాశముందని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. మరి డ్రెస్సింగ్ టేబుల్‌ ఎక్కడ ఉంచితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా మహిళలు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మేకప్ చేసుకుంటారు. వాస్తు ప్రకారం, సరైన దిశలో కూర్చొని మేకప్ చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం. అందుకే డ్రెస్సింగ్ టేబుల్‌ను ఎక్కడ, ఎలా ఉంచాలో తెలుసుకోవడం చాలా అవసరం.

డ్రెస్సింగ్ టేబుల్‌కు సరైన దిశలు..

వాస్తు ప్రకారం, బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్‌ను తూర్పు, పశ్చిమ, ఉత్తరం దిశల్లో ఉంచడం మంచిదని భావిస్తారు. అలాగే ఈశాన్యం, వాయువ్య దిశల్లో కూడా ఉంచవచ్చు. ఈ దిశల్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంచితే దాంపత్య జీవితంలో ప్రేమ, శాంతి, ఆనందం కొనసాగుతాయని నమ్మకం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version