బాహుబలికి రివ్యూ ఇస్తానన్న మిస్‌ వరల్డ్‌.

బాహుబలికి రివ్యూ ఇస్తానన్న మిస్‌ వరల్డ్‌

 

 

 

 

ఓపల్‌ సుచాత (opal suchata ) పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

108 దేశాల బ్యూటీలను వెనక్కి నెట్టి ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుందీ థాయ్‌ భామ(Thai beauty) .

ఓపల్‌ సుచాత (opal suchata ) పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

108 దేశాల బ్యూటీలను వెనక్కి నెట్టి ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుందీ థాయ్‌ భామ(Thai beauty) .

మిస్‌ వరల్డ్‌ 2025గా విజయం సాధించిన అనంతరం ఆమె నేషనల్‌ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన రోజు.

వ్యక్తిగతంగానే కాకుండా థాయ్‌లాండ్‌ ప్రజలకూ ఇదొక మైలు రాయి అనే అనాలి.

నేనెంతో గర్వపడుతున్నా.

మిస్‌ వరల్డ్‌ స్టేజ్‌పై మా దేశానికి గుర్తింపు లభించింది.

మా దేశానికి ఇదే తొలి విజయం. ఇలాంటి ఒక రోజు కోసం మేమంతా 70 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం.

ఈ ప్రయాణం క్లిష్టమైనదని నేను చెప్పను.

ఎందుకంటే, మన హృదయానికి చేరువైన దానిని పొందేందుకు వేేస ప్రతి అడుగుకు ఒక అర్థం ఉంటుంది’’ అని అన్నారు.

ఆ సినిమాపై రివ్యూ ఇస్తా..
 “నాకు బాలీవుడ్‌ నటి అలియాబట్‌ తెలుసు.

నా జర్నీలో ఎంతో మంది సుందరీమణులు నాలో స్ఫూర్తి నింపారు’’ అని అన్నారు.

భారత దేశం నుంచి ప్రపంచ సుందరిగా విజయాన్ని అందుకున్న వారిలో ఎవరంటే మీకు ఇష్టం అని ప్రశ్నించగా..

‘‘ఈ ప్రశ్నకు బదులు చెప్పడం చాలా కష్టం.

నాకెంతో ఇష్టమైన మానుషి చిల్లర్‌ను ఫినాలేలో కలిశాను.

అదే విధంగా నాకు ప్రియాంకా చోరప్రా అంటే ఎంతో ఇష్టం.

ఆమె నుంచి స్ఫూర్తి పొందాను. వీలునప్పుడు సినిమాలు చూస్తుంటా.

బాలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాలు ఇప్పటికే చూశాను.

అలియాభట్‌ నాకు తెలుసు.

ఆమె నటించిన ‘గంగూబాయి కాఠియావాడి’ నాకెంతో నచ్చింది.

ప్రేక్షకులను ఆలోచింప చేేస చిత్రమది.

‘బాహుబలి’ సినిమా గురించి విన్నాను.

కానీ, ఆ సినిమా ఇంకా చూడలేదు.

మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భాగంగా కొన్నిరోజుల క్రితం మేమంతా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీ సందర్శించాం.

పోటీలు పూర్తైన తర్వాత తప్పకుండా ఆ సినిమా చూడాలని నాకు నేనే ప్రామిస్‌ చేసుకున్నా.

మళ్లీ నేను ఇక్కడికి వచ్చే నాటికి తప్పకుండా ఆ సినిమాపై రివ్యూ ఇస్తా’’ అని అన్నారు.  

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version