కాంగ్రెస్ పార్టీ నుండి చిలువేరు రజిని భారతి సస్పెండ్
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు
నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని రాజేందర్
నర్సంపేట,నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నర్సంపేట మాజీ సర్పంచ్ చిలువేరు రజిని భారతి,మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి తక్కల్లపల్లి ఉమా లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ నాయకురాలు చిలువేరు రజినీ భారతి,తక్కల్లపల్లి ఉమాలు గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో పలుసార్లు మందలించిన
మార్పురాలేదని అన్నారు.
పార్టీకి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయనే భావంతో కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు వివరించారు.ఇక నుండి వారు చేపట్టే కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్ తెలిపారు.
