ఏపీలో భారీ అగ్ని ప్రమాదం

 

ఏపీలో భారీ అగ్ని ప్రమాదం

రామవరంలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం మండలం రామవరం ఐటీసీ గోడౌన్‌లో మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు.

రామవరంలో ఇవాళ(శనివారం) ఉదయం భారీ అగ్ని ప్రమాదం (Major Fire Accident) చోటుచేసుకుంది. ఆనందపురం మండలం రామవరం ఐటీసీ గోడౌన్‌లో మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సమాచారం అందగానే సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఎనిమిది ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఘటన స్థలానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version