హైదరాబాద్‌కు గుడ్‌బై ముంబైకి బన్నీ మకాం

హైదరాబాద్‌కు గుడ్‌బై
ముంబైకి బన్నీ మకాం

 

అల్లు అర్జున్‌ తన కుటుంబంతో పాటు ముంబైలో తాత్కాలికంగా స్థిరపడనున్నారని తెలుస్తోంది. తను నటిస్తున్న కొత్త సినిమా రాకా షూటింగ్‌ ఎక్కువగా ముంబైలోనే జరుగుతుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, సినిమా కఠినమైన షూటింగ్ షెడ్యూల్‌ను నిర్వహించడానికి అవకాశం దొరుకుతుంది. ఆపై రెండు నగరాల మధ్య నిరంతర ప్రయాణాన్ని తగ్గించుకోని సినిమా కోసం మరింత సమయం కేటాయించవచ్చని బన్నీ ఆలోచిస్తున్నాడట.

బాలీవుడ్‌లో వస్తున్న వార్తల ప్రకారం అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి పూర్తిగా అంకితమవ్వడానికి రాబోయే రెండు, మూడు సంవత్సరాల పాటు ముంబైలోనే ఉండాలని ప్లాన్‌ చేస్తున్నారట. తరచూ ప్రయాణాల వల్ల కలిగే అలసట లేకుండా ఉండాలని అనుకున్నారట. ఈ సమయం షూటింగ్‌పై దృష్టి పెట్టడానికి తనకు సహాయపడుతుందని ఆయన భావిస్తున్నారని సమాచారం. రాకా మూవీలోని పాత్ర కోసం ఆయన శారీరకంగా పెద్ద మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. రాకాలో తన పాత్ర కోసం ప్రతిరోజూ దాదాపు నాలుగు గంటల పాటు ప్రాస్థెటిక్ మేకప్‌పై గడుపుతున్నారని, ఆ తర్వాత దానిని తొలగించడానికి మరో రెండు గంటలు వెచ్చిస్తున్నారని సమాచారం. అందుకే ముంబైలోనే ఉంటే సమయం కాస్త కలిసొస్తుందని బన్నీ ఉన్నారట.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version