సూర్యాపేట జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ గా షేక్ సైదా .. టీజేఏ ఆధ్వర్యంలో ఘన సన్మానం.

సూర్యాపేట జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ గా షేక్ సైదా .. టీజేఏ ఆధ్వర్యంలో ఘన సన్మానం.

సూర్యాపేట, నేటి ధాత్రి:

సూర్యాపేట జిల్లా అక్రెడిటేషన్ కమిటీ సభ్యునిగా ఎన్నికైన తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జర్నలిస్ట్ షేక్ సైదా ను సోమవారం జర్నలిస్టులు టీజేఏ యూనియన్ కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీజేఏ సుర్యాపేట జిల్లా కోశాధికారి కొత్తపల్లి మధు సూధన్ మాట్లాడుతూ. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ తరపున సుర్యాపేటజిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యునిగా అవకాశం రావడం గర్వకారణమన్నారు. కమిటీ సభ్యునిగా ఉండేందుకు అతనికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అర్హులైన జర్నలిస్టుల హక్కుల కోసం యూనియన్ తరపున నిరంతరం పోరాటం చేయాలని సూచించారు. జర్నలిస్టు యొక్క హక్కులు కాపాడుటకు తన వంతు కృషి చేయాలన్నారు. జర్నలిస్టులకు బస్సు పాస్ లు పూర్వం మాదిరిగానే కొనసాగేందుకు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులందరూ ప్రయత్నం చేయాలన్నారు. (టీజేఏ) యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు రెండు పడకల గదులు లేదా ఇంటి స్థలం రైల్వే పాస్ పునరుద్ధరణ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొల్లోజు నాగేంద్ర చారి, గోరంట్ల శ్రీనివాస్, భయ్యారపు రవీంద్ర, కొండమీది నరసింహారావు, మిద్దె రాకేష్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version