సిరీస్ ఆసీస్ వశం
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా 133 పరుగులతో గెలిచింది…
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా 133 పరుగులతో గెలిచింది. దీంతో 3 టెస్టుల సిరీస్‌ను ఆసీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకొంది. ఆసీస్ నిర్దేశించిన 277 పరుగుల ఛేదనలో విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 143 రన్స్‌కే కుప్పకూలింది. కెప్టెన్ రోస్టన్ చేజ్ (34) టాప్ స్కోరర్. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. స్మిత్ (71), గ్రీన్ (52) రాణించారు. షమర్ జోసెఫ్ 4 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 286, విండీస్ 253 రన్స్ చేశాయి.