పరకాల నేటిధాత్రి
రాష్ట్రవ్యాప్తంగా 28 నియోజకవర్గ కేంద్రాల్లో తొలిదశలో చేపట్టనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్స్ భవన నిర్మాణాలకు గత అక్టోబర్ నెలలో ప్రభుత్వం శంకుస్థాపన చేపట్జింది అయితే ఈ శంకుస్థాపనలు జరిగే వాటిల్లో ఎక్కువ నియోజకవర్గాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చెందినవే కావడం గమనార్హం. ఇది ఇలాగా అంటే పరకాల నియోజవర్గం రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల పట్టణంలో గురువారం ఉదయం క్యాంప్ ఆఫీసులో నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాకింగ్ చేపట్టారు.ఈ సందర్భంగా స్వేరో నాయకులు భద్రాది జోన్ మాజీ అధ్యక్షులు ఒంటేరు చక్రి స్వేరో,హనుమకొండ జిల్లా నాయకులు మంద మనోజ్ స్వేరో,ఎస్ ఎస్ యు వరంగల్ జిల్లా నాయకులు మరియు వరంగల్ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి బొచ్చు రాజు స్వేరో,మరియు పరకాల పట్టణ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.స్వేరో నాయకులు మాట్లాడుతూ ఇంటిగ్రేడ్ స్కూల్ రాజిపేటలో నిర్మిస్తున్నారు.కావునా ఈ యొక్క ఇంటిగ్రేట్ పాఠశాల నిర్మాణాన్ని పాలిటెక్నిక్ కళాశాల ప్రక్కన ఉన్న పాత హాస్టల్ వద్ద నిర్మించాలని, అలాగే రాజిపేట గ్రామంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించే స్థానంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందిస్తూ ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని స్వేరో నాయకులు తెలిపారు.