మతోన్మాద బిజేపిని ఓడించేందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు

సిపిఐ జిల్లా, పట్టణ కార్యదర్శులు రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి శ్రీనివాస్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మతోన్మాద బిజేపి నిరంకుశ పాలనను ఓడించేందుకు సిపిఐ పార్టీ బలపరుస్తున్న ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతుందని అందులో భాగంగానే పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించేందుకు చెన్నూరు నియోజకవర్గ ప్రజలు తమ ఓటును కాంగ్రెస్ పార్టీ కి వేయాలని కోరుతున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ,రామకృష్ణాపూర్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు అన్నారు. గురువారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి శ్రీనివాస్ లు మాట్లాడుతూ…. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనలో ఉన్నత స్థాయి వర్గాలను అందలం ఎక్కిస్తూ సామాన్య నిరుపేదలను అట్టడుగున తొక్కేస్తున్నారని దుయ్యబడ్డారు. మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి, లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ పార్టీ బలపరుస్తున్న కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వనం సత్యనారాయణ, రాములు, రాజం, ఈరవెన రవీందర్, సత్యనారాయణ, రమేష్ ,దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version