మారేపల్లి సుధీర్ గెలుపుకై బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపుకై బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ముడుపు రవీందర్ మాట్లాడుతూ..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు..ఉద్యమ నేత..మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని, అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కేంద్రంలో పదేళ్లు పాలించిన అసమర్థపు బిజెపి పార్టీని త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పి..పార్లమెంట్ లో తెలంగాణ సమస్యలపై పోరాడేందుకు మారేపల్లి సుధీర్ కుమార్ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దేవునూరి కుమార్ముడుపు రవీందర్ బండారి రామస్వామి గుడిమల్ల రమేష్ శనగరపు శ్రీనివాస్ వనం రాజయ్య చిలుక మారి శ్రీను శనిగరపు శ్రీను వనం కార్తీకు మల్లయ్య , అరికాంతపు అన్నారెడ్డి, మంగళపల్లి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version