అమాంతం పెరిగిన రేవంత్ రేంజ్!

`కేరళ గెలుపుతో సిఎం రేవంత్ కు పార్టీలో పెరిగిన ప్రాధాన్యత.

`తెలంగాణ అభివృద్ధి కోసం వేదిక సాక్షిగా ప్రశ్నించిన సిఎం రేవంత్ రెడ్డి.

`మోడీ సిఎం గా వున్నపుడు యుపిఏ సహకరించిన తీరు గుర్తు చేశారు.

`గుజరాత్ మోడల్ కోసం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అడిగినన్ని నిధులిచ్చారు.

`ఆ విషయం గుర్తు చేసి కాంగ్రెస్ సిఎం గా తన బాధ్యత నిర్వర్తించారు.

`నిధులు ఇవ్వమని కేంద్రాన్ని కోరడం వేరు.

`గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతం చూపించ లేదు అని గుర్తు చేయడం గొప్ప విషయం.

`అలా ప్రధాని మోడీని ప్రశ్నించిన సిఎం ఎవరూ లేరు.

`ఆ క్రెడిట్ కూడా సిఎం రేవంత్ రెడ్డికే దక్కింది.

`సమయం చూసి రాజకీయం చేయడంలో సిఎం రేవంత్ దిట్ట.

`ఢిల్లీకి వెళ్లి మోకారిళ్లడం కాదు, తెలంగాణ గడ్డ మీద ప్రశ్నించిన ఘనత సిఎం రేవంత్ కే దక్కింది.

`పరిపాలన పరంగా కలిసి సాగుతాం.. వివక్ష చూపిస్తే నిలదీస్తాం అని చెప్పకనే సిఎం రేవంత్ చెప్పారు.

`తన బాధ్యతను సగర్వంగా నిర్వర్తించారు.

`తెలంగాణ కోసం ఎవరినైనా ఎదిరిస్తాననని నిరూపించారు.

`అటు పార్టీపై పట్టు సాధించారు.

`కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఆలోచించుకునేలా చేశారు.

`తనపై కాంగ్రెస్ నాయకులు ఎవరూ పిర్యాదులు చేసినా అధిష్టానం నమ్మకుండా సంకేతం పంపారు.

`ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే వాస్తవం చేసి చూపించారు.

హైదరాబాద్, నేటిధాత్రి:
సమాజంలో అన్ని వర్గాలలో వున్నట్లు రాజకీయాల్లో కూడా అదృష్టవంతులు, దురదృష్టవంతులు వుంటారు. కొంత మంది జీవితాంతం రాజకీయాలు చేసినా అవకాశాలు కలిసిరావు. అవకాశాలు వచ్చినట్లే వచ్చినా చేజారిపోతుంటాయి. అవకాశాలు ముందు వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోతుంటాయి. అలా ప్రతిసారి ఏదో రకమైన ఇబ్బంది ఎదురై జీవితాంతం పదవులు పొందని వాళ్లు అనేక మంది వున్నారు. కాని కొంత మందికి అవకాశాలు వరసుగా వస్తుంటాయి. అడపా దడపా చిన్న చిన్న సమస్యలు ఎదరైనా మళ్లీ వెంటనే మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ అవకాశాలు పొందుతుంటారు. ఎక్కువ పదవులు పొందుతుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటినుంచి ఒక్కొమెటు ఎక్కుతూ ప్రజల్ని మెప్పిస్తూ నాయకుడైన వారు అతి కొద్ది మంది మాత్రమే వుంటారు. అలాంటి నాయకుల్లో సిఎం. రేవంత్ రెడ్డి ఒకరు. ఎవరి ప్రోత్సాహం లేకుండా, ఎవరి అండా దండా లేకుండా తన సూక్ష్మబుద్దితో రాజకీయాలు చేసి ఎదిగిన ఇంకా అతి కొద్ది మంది మాత్రమే వుంటారు. దేశ వ్యాప్తంగా చూసినా, చరిత్ర మొత్తం తిరగేసినా అలాంటి వారు ఇంకా అతికొద్ది మంది మాత్రమే వుంటారు. వాళ్లందరినీ వేళ్ల మీద లెక్కబెట్టేలా వుంటారు. అలాంటి వారిలో కూడా సిఎం. రేవంత్‌రెడ్డి ఒకరు. ఈ తరంలో ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి, రేవంత్‌రెడ్డి వరకు అలా ఎదిగి చరిత్ర సృష్టిస్తుంటారు. అలా చరిత్ర సృష్టించిన సిఎం. రేవంత్ రెడ్డి కష్టం, అదృష్టం రెండూ కలిసి పైకి వచ్చారు. ఎంతో కష్టపడి ఎదిగారు. అడుగడుగునా ఎదురైన సవాళ్లను ఎదరించి పైకొచ్చారు. ఆత్మస్ధైర్యం నింపుకొని పైకొచ్చారు. జీవితంలో ఒక్కసారి ఓటమి ఎదురైనా మళ్లీ ఆరు నెలల్లో దానిని గెలుపుగా మార్చుకొని నిలబడ్డారు. తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్‌లో అప్పటికే ఎంతో మంది సిఎం. కావాలన్న కలలు కంటున్న వారిని త్రోసిరాజని రేవంత్‌రెడ్డి సిఎం. అయ్యారు. అంటే అందులో ఆయన పడిన కష్టం ఎంతో మాటల్లో చెప్పలేనిది. రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచే అవకాశాలు స్వాగతిస్తూ వచ్చాయి. ఆయనను ఉన్నత స్ధానం చేరుకునేలా చేశాయి. సహజంగా గత రెండు దశాబ్ధాల క్రితం నుంచి రాజకీయాలు చేస్తున్నవారిలో ఎవరూ స్వతంత్రంగా ఎదిగిన వారు పెద్దగా లేరు. కాని ఈ గత ఇరవై ఏళ్ల క్రితం నుంచి కూడా స్వతంత్రంగా ఎదిగిన ఏకైక నాయకుడిగా సిఎం. రేవంత్‌రెడ్డినే చెప్పొచ్చు. జడ్పీటీసి సభ్యుడు అంటే సగం ఎమ్మెల్యేతో సమానం. అలాంటి పదవి ఏదో ఒక పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినా ఒక్కొసారి గెలవడం కష్టం. అందులోనూ బలమైన పార్టీ అధికారంలో వున్నప్ప్పుడు ఇండిపెండెంటుగా గెలవడం అనేది అసాద్యం. కాని సిఎం. రేవంత్‌రెడ్డి నిలిచి గెలిచారు. గెలిచి నాయకుడయ్యారు. తన నయకత్వ ప్రస్తానానికి పునాది వేశారు. తన అప్రతిహత విజయాలకు బాటలు వేసుకున్నారు. ఆ వెంటనే ఇండిపెండెంటుగా శాసన మండలి సభ్యుడయ్యారు. అప్పటి రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఏ పార్టీ అండ లేకుండా ఎమ్మెల్సీ కావడం అనేది అంత సులువైన పని కాదు. అసాద్యాన్ని సుసాధ్యం చేయడం జడ్పీటీసి నుంచే మొదలు పెట్టారు. తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో ఎంతో మంది రాజకీయాలు అక్కడే ఆగిపోయాయి. కాని అక్కడ కూడా రేవంత్‌రెడ్డి రాజకీయం ఆగిపోలేదు. అలసిపోలేదు. మరింత ముందుకు దూకుడుగా వెళ్లింది. తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడుగా వున్న సిఎం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్ప్పుడు అందరూ చెరువులో నీటి చుక్క. సముద్రంలో తుమ్మర అనుకున్నారు. కాని ఆ సముద్రాన్ని ఒడిసిపట్టే నాయకుడు రేవంత్ రెడ్డి అవుతారని ఎవరూ అనుకోలేదు. అలా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర శాఖ అద్యక్షుడైన రేవంత్ రెడ్డి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ధీరుడయ్యారు. పదేళ్లుగా అధికారం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి బలమయ్యాడు. తనను అద్యక్షుడి చేసినందుకు పార్టీని అదికారంలోకి తీసుకొచ్చిన తనపై వుంచిన నమ్మకాన్ని నిజం చేశారు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారు. తెలంగాణ ఇచ్చినా అన్యాయమైపోయామన్న భాద నుంచి కాంగ్రెస్‌ను బైట పడేశారు. దక్షిణాది ఎప్ప్పుడూ కాంగ్రెస్‌కు అండగా వుంటుందన్న చరిత్రను మరోసారి నిజం చేశారు. అలా సిఎం. అయిన రేవంత్‌రెడ్డి తన ఇమేజ్‌ను పెంచుకుంటూ, కాంగ్రెస్ పార్టీ విస్తరణలో కూడా పాలు పంచుకుంటున్నాడు. విజయాలు అందిస్తున్నాడు. తాజాగా దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. అందులో కేరళ ఎన్నికల బాద్యతలను కాంగ్రెస్ అధిష్టానం సిఎం. రేవంత్ రెడ్డి మీద పెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకోసం అనుసరించిన వ్యూహాలను అడుగడునా అమలు చేసి, కేరళలో కాంగ్రెస్ గెలుపుకు సిఎం. రేవంత్‌రెడ్డి ఇతోదిక కృషి చేశారు. కేరళలో కాంగ్రెస్‌ను ఒక రకంగా అదికారంలోకి తెచ్చారు. తనపై పార్టీ వుంచిన నమ్మకాన్ని మరోసారి నిజం చేసుకున్నారు. దక్షిణాదిలో మరో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేశారు. అయితే కేరళ ఎన్నికల ప్రచారంలో సిఎం. రేవంత్ కీలక భూమిక పోషించారు. 140 నియోజకవర్గాలలో సిఎం. రేవంత్‌రెడ్డి 70 నియోజకవర్గాలకు పైగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు సరిగ్గా కొద్ది రోజులు మందు ఓవారం రోజుల పాటు విసృత ప్రచార పర్యటనలు చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించారు. పెద్దఎత్తున రోడ్ షోలు చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను గుర్తు చేశారు. రైతు రుణమాఫీ గురించి చెప్పారు. రైతు భరోసా ఇస్తున్నామన్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధరతోపాటు, బోనస్ ఇచ్చే విషయాన్ని వెల్లడించి కేరళ ప్రజలను ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ వైపు జనం తిరిగేలా చేశారు. అలా ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజక వర్గాలలో కాంగ్రెస్ గెలిచింది. సిఎం. రేవంత్ ప్రచారం నూటి నూరు శాతం సక్సెస్ అయ్యింది. ఆయన ఎక్కడెక్కడైతే ప్రచారం చేయలేదో అక్కడ ఎల్డీఎఫ్ గెలిచింది. రేవంత్‌రెడ్డి ప్రచారం చేసిన అన్ని ప్రాంతాలలోనూ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పైగా కాంగ్రెస్ చరిత్రలోనే ఇంత పెద్ద విజయం కేరళలో సొంతం చేసుకోలేదు. ఇలా పార్టీలో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది. ఇక ఆయన ఈ మధ్యలోనే సాదించిన రెండో విజయం మరో అధ్భుతం. తెలంగాణలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ సభలో ప్రదాని మోడీ, సిఎం. రేవంత్ రెడ్డి ఇద్దరూ మాట్లాడారు .ఆ సమయంలో తెలంగాణ ప్రగతి కోసం కేంద్రం మరింతగా నిధులు ఇవ్వాలని సిఎం. రేవంత్‌రెడ్డి కోరారు. అయితే ఇందులో ఓ తిరకాసు పెట్టారు. గతంలో ప్రధాని మోడీ , గుజరాత్ సిఎంగా వున్న సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రదాని మన్మోహన్ సింగ్ ఇతోదిక నిధులు ఇవ్వడం జరిగింది. గుజరాత్ మోడల్ అభివృద్దికి మన్మోహన్ సింగ్ సహకరించడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఫెడరల్ స్పూర్తితో గుజరాత్ మోడల్ కోసం అడిగినన్ని నిధులు మన్మోహన్ సింగ్ బేషజాలు లేకుండా ఇచ్చారు. ఇప్ప్పుడు అదే తరహా మోడల్ తెలంగాణ కోసం ప్రధాని మోడీ అవసరమైనన్ని నిధులు ఇవ్వాలని కోరారు. ఓ వైపు నిధులను అభ్యర్ధిస్తూనే మరో వైపు గతంలో తాము సహకరించినట్లు మీరు సహకరించాలని ఏకంగా ప్రధాని మోడీకే, సిఎం. రేవంత్ గతం గుర్తు చేశారు. ఫెడరల్ స్పూర్తిని మరోసారి గుర్తు తెచ్చుకునేలా చేశారు. దాంతో ప్రధాని మోడీకి ఏం చెప్పాలో అర్ధం కాని విషమ స్ధితిలోకి నెట్టేశారు. సిఎం. రేవంత్ రెడ్డి రాజకీయ చాణక్యం ఫ్రదాని మోడీ పసిగట్టేశారు. రాష్ట్ర అభివృద్ది కాంక్ష వున్న రేవంత్ రెడ్డి లాంటి నాయకులు రాజకీయాల్లో వుండాలన్నట్లు స్పందించారు. మాతో కలసి సాగండి. గుజరాత్‌కు ఇచ్చిన దానికంటే ఎక్కువ నిధులిస్తానని ప్రధాని మోడీ చెప్పేలా చేశారు. అలా సొంత గడ్డ మీద నుంచి ప్రధాని మోడీని ఇరుకున పెట్టిన సిఎం ఒక్క రెవంత్ రెడ్డి తప్ప మరొకరు లేరు. ముఖస్తుతి లేకుండా, రాష్ట్రం కోసం నిదులను కోరిన ఏకైక నాయకుడు సిఎం. రేవంత్‌రెడ్డి. దాంతో ఆయన ఇమేజ్ ఒక్కసారిగా మరింత పెరిగింది. అటు పార్టీలోనూ రేవంత్‌కు తిరగులేదు. ఇటు పాలనా పరంగా కేంద్రం నుంచి ప్రశంసలందుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version