మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు
నడి కూడ,నేటి ధాత్రి:గత ప్రభుత్వం విద్యను అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మన ఊరు మనబడి ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా నడి కూడ మండల కేంద్రంలో మన ఊరు మనబడి జిల్లా కలెక్టర్ మేరకు జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్, ఎంపీ పీ ఎస్ స్కూల్ సెలెక్ట్ కావడం జరిగింది. అందులో భాగంగా జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో ఎలక్ట్రిషన్, క్లాస్ రూమ్ రిపేర్,డైనింగ్ హాల్, టాయిలెట్లు,కాంపౌండ్ వాల్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగింది. కేటాయించిన నిధులను కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ పెట్టి గత సర్పంచులను పనులు చేయించి సంబంధిత అధికారులచే రికార్డు చేపిస్తూ రికార్డు ప్రకారం బిల్లులు చెల్లించుకుంటూ పనులు చేయించడం జరిగింది. మిగిలిపోయిన పనులు పూర్తి చేసిన తర్వాత రికార్డు చేయడం జరిగింది. రికార్డు ప్రకారం కలెక్టర్ గత సంవత్సరం ఆగస్టు ఎఫ్ టి ఓ జనరేటర్ చేయడం జరిగింది. ఎంపీపీ ఎస్ స్కూల్ శిధిల వ్యవస్థలో ఉన్న క్లాస్ రూమ్స్, టైల్స్,కాంపౌండ్ వాల్స్, నిర్మాణం కోసం ఈజీఎస్ మరియు ఎస్ ఎఫ్ సి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈజీఎస్ నిధుల నుండి కాంపౌండ్ వాల్ టాయిలెట్స్ పూర్తి చేయడం జరిగింది. ఎస్ ఎఫ్ సి నుండి నూతన తరగతి గదులను నిర్మించడం జరిగింది. వీటిని సంబంధిత ఇంజనీర్ అధికారులు రికార్డ్ చేసి ఆన్లైన్ చేయడం జరిగింది. చేసిన పనులకు ఈజీఎస్ నిధులు విడుదల వారిగా రావడం జరుగుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల చేసిన పనులు సర్పంచులు అప్పులు తెచ్చి ఇబ్బందులు పడుతున్న తరుణంలో చేసిన వాళ్లకు నిధులు ఇవ్వకుండా ఇప్పుడున్న ప్రభుత్వం మన ఊరు మనబడి పక్కకు పెట్టి ఇప్పుడు అమ్మబడి ఆదర్శ పాఠశాల పెట్టి తూతూ మంత్రంగా చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేక ఇప్పుడున్న ప్రభుత్వం పేరు కోసం మోసం చేయడం వల్ల సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాక అయోమయంలో ఉన్నారు. కాబట్టి మాకు ఎన్ని ప్రభుత్వాలు మారిన మేము అధికారులను నమ్మి పనులు చేస్తాము కాబట్టి వెంటనే కలెక్టర్ స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి మా బిల్లులు ఇప్పించగలరని నడికూడ గ్రామ మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు కోరుతున్నారు.