విద్యార్థులు ఐస్ క్రీములు చాక్లెట్లు ఎక్కువ తినకూడదు
డాక్టర్ నాగజ్యోతి
భూపాలపల్లి నేటిధాత్రి
మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్మైల్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ నాగజ్యోతి హాజరైనారు అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ తిని సరిగా బ్రష్ చేయకపోవడం వల్ల జీవితాంతం ఉండాల్సినటువంటి దంతాలు త్వరగా పాడే అవకాశం ఉందని, బ్రష్ చేసుకునే విధానం దంతాలను సంరక్షించుకునే బాధ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి సరైన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ ఇచ్చినటువంటి సలహాలు సూచనలు విద్యార్థులు తప్పకుండా పాటించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాలల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డిజిఎం చేతన్, ఎజిఎం పద్మాకర్, కోఆర్డినేటర్ శివ కోటేశ్వరరావు, డీన్ స్వామి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
