విద్యార్థులు చదువుతోపాటు “క్రీడల్లో రాణించాలి”

ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి…

పాలకుర్తి నేటిధాత్రి

గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. శనివారం పాలకుర్తి మండలంలోని నారాబోయిన గూడెం గ్రామంలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ క్రీడలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సేవాలాల్ సేన ముందుకు వచ్చి గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడానికి కబడ్డీ క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మట్టిలో మాణిక్యాలుగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకే ఉంటుందని, వారి నైపుణ్యాలను వెలికితీయడానికి కృషి చేయాలన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటుగా శారీరక దృఢత్వం పెరుగుతుందని, గెలుపు ఓటములకు అతీతంగా స్నేహ పూర్వకంగా క్రీడా పోటీలు జరుపుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. గత ప్రభుత్వం డబ్బులు బెడ్ రూమ్ నిర్మాణాలను పూర్తి చేయకుండా వదిలేసిందని విమర్శించారు. దేవరుప్పుల మండలంలోని సింగరాజుపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల నుండి దరఖాస్తు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీ పథకాలు అందుతాయని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *