ఎస్సై జి శ్రావణ్ కుమార్.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఏవిపి ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్ స్థాయి క్రీడల ముగింపు కార్యక్రమానికి అతిథి లు గా పాల్గొన్న
చిట్యాల ఎస్సై శ్రావణ్ కుమార్ మరియు ఆర్ఎస్ఎస్ జిల్లా కర్యవహ
బుర్ర సదయ్య పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు క్రమ శిక్షణ తో చదువు ,ఆటల పట్ల శ్రద్ధ వహించాలి అని , క్రీడల్లో గెలుపు ఓటమి సహజం అని ,క్రీడ స్ఫూర్తిని ప్రదర్శించి పాఠశాలలకు పేరు తీసుకురావాలని ముఖ్యంగా
మత్తుపదారులకు దూరంగా ఉండాలని అన్నారు , బుర్ర సదయ్య మాట్లాడుతూ స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకొని సామాజిక సేవను అలవర్చుకోవాలని, జాతీయ పునర్నిర్మానంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ ఇన్చార్జి వేల్పుల రాజ్ కుమార్, నగర కార్యదర్శి బుర్ర అభిజ్ఞ గౌడ్, బుర్ర అవినాష్ గౌడ్, బండ అచ్యుత్, గుర్రపు కృష్ణ, సరికొమ్ముల శశివర్ధన్, కార్యకర్తలు , ఫిజికల్ డైరెక్టర్లు
క్రీడాభిమానులు పాల్గొన్నారు,
వాలీబాల్ ప్రధమ బహుమతి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ చిట్యాల,
ద్వితీయ బహుమతి మహాత్మ జ్యోతిరావు పూలే స్కూల్ లింగాల,కబడ్డీ ( బాలికలు)
ప్రధమ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ చిట్యాల.
ద్వితీయ: చిట్యాల జిల్లా పరిషత్ హై స్కూల్, కబడ్డీ బాలికలు ( కలశాల స్థాయి) తెలంగాణ మోడల్ స్కూల్ కోర్కుశాల,
ద్వితీయ కేజీబీవీ చిట్యాల,
కబడ్డీ బాలురు ( కలశాల స్థాయి) తెలంగాణ మోడల్ స్కూల్ చిట్యాల
ప్రభుత్వ జూనియర్ కలశాల చిట్యాల
వాలీబాల్ బాలురు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే స్కూల్, మొగుళ్ళపల్లి ద్వితీయ జడ్.పి.హెచ్.ఎస్ మొగుళ్ళ పల్లి గెలుపొందినారు, బాలికల ఓవరాల్ ఛాంపియన్గా మండల కేంద్రానికి చెందిన సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థులు ఎంపికైనారు