నర్సంపేట,నేటిధాత్రి :
వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన అండర్ 12,14 సంవత్సరాల బాలికల విభాగంలో నర్సంపేటలోని మహాత్మ జ్యోతిరావు బాపులే స్కూల్ విద్యార్థులు పరుగు పందెంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వర్షిత, సహస్ర,నయానిక,అక్షర గోల్డ్ మెడల్ సాధించారు.షాట్ పుట్ విభాగంలో రక్షిత,లేఖ సిల్వర్ మెడల్ సాధించారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలు ఈనెల 18,19వ తేదీలలో హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ మంగా తెలిపారు.జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు పాఠశాల ప్రిన్సిపాల్ మంగా, పిఈటి శిరీష, ఉపాధ్యాయ బృందం అభినందించారు.