హసన్ పర్తి/ నేటి ధాత్రీ
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం హసన్ పర్తి సి ఐ జె. సురేశ్ ఒక సందర్భం లో మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎన్నికల నియమావలీ అమలులో ఉన్నందున ప్రజలందరూ ముఖ్యంగా సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో ఇతరులకు రెచ్చగొట్టే విధంగా ఇబ్బంది పడే విధంగా తప్పుడు పోస్టులు పెడితే పెట్టిన వారిపై మరియు గ్రూప్ అడ్మిన్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కావున ప్రజలందరూ వాట్సప్ గ్రూపులో పోస్టులు చేసేటప్పుడు పార్టీకే గాని ఏ వ్యక్తికైనా గాని ఏ వర్గానికైనా ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని తెలియజేస్తూ ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో మద్యాన్ని సేవించకూడదని దీనికి స్పెషల్ టీంలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. కావున ప్రజలందరూ పోలీస్ వారికి సహకరిస్తూ సమాజంలో శాంతి భద్రతలను పాటిస్తూ శాంతియుతంగా ఉండాలని సూచించారు.