మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్ లో ఏలేటి రమాదేవి-రాజిరెడ్డి దంపతుల కుమార్తె రమ్యారెడ్డి-మధుకర్ రెడ్డి దంపతుల వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నూతన వధూవరులకు అక్షింతలు వేసి..ఆశీర్వదించారు. కలకాలం నిండు నూరేళ్లు..సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో, పిల్లాపాపలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బల్గూరి తిరుపతిరావు, బీఆర్ఎస్ పార్టీ మొగుళ్లపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఏలేటి నరసింహారెడ్డి, కో ఆప్షన్స్ సభ్యుడు రహీం బి ఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
