వీధి కుక్కలకు…. వింత రోగాలు..!
#భయాందోళనలకు గురవుతున్న మండల ప్రజలు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మునుపెన్నడూ లేని విధంగా జన సంచారంలో తిరిగే వీధి కుక్కలకు వింతైన రోగం సోకి చూసేందుకు భయంకరంగా ఉండడంతో పెద్దలతో పాటు పిల్లలు సైతం రోడ్లపై రావాలంటనే భయాందోళనలకు గురవుతున్నామని మండల ప్రజలు వాపోతున్నారు. మండల కేంద్రంతో పాటు గ్రామాలలో సైతం వింతైన రోగంతో చర్మం ఊడి కుళ్ళిన శవంలా వీధి కుక్కలకు రోగాలు సోకి జనం మధ్య సంచరిస్తున్నాయని అవి కాస్త జనాలపై పడి కరిస్తే అంతే సంగతి . ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో వీధి కుక్కలు సంచరిస్తూ చిన్న పెద్ద అని తేడా లేకుండా విచక్షణ రహితంగా జనాలపై పడి కరచి ప్రజలు గాయాల పాలైన సంఘటనలు మండలంలో చాలా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రోజురోజుకు వింత రోగాల బారిన పడుతున్న వీధి కుక్కలను తక్షణమే జిల్లా పంచాయతీ ఉన్నత అధికారులు వాటిని నిర్మూలించే విధంగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
