యువతకు ఆదర్శంగా రాష్ట్ర యువజన కాంగ్రేస్ కార్యదర్శి కుంజా సూర్య గారు .
కన్నాయిగూడెం మండల ఇంచార్జి బుట్టాయిగూడెం (సర్పంచ్) జాడి రాంబాబు
ఏటూరునాగారం, నేటిధాత్రి
యువనేత మంత్రివర్యులు సీతక్క గారి తనయుడు కుంజా సూర్య గారి ఆదేశాలతో కన్నాయిగూడెం మండల వాలీబాల్ టీం కు డ్రస్ కోడ్ పంపిణీ చేసినా బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు గారు
మహారాష్ట్ర ముక్కిడి గుట్టలో జరుగుతున్న వాలీబాల్ టోర్నమెంట్ కు వెళుతున్న కన్నాయిగూడెం మండల వాలీబాల్ టీం కు అల్ ది బెస్ట్ తేలియజేసి మంచి విజయంతో తిరిగి రావాలని కోరారు…
అదే విధంగా సర్పంచ్ జాడి రాంబాబు గారు మాట్లాడు మండలంలోని యువతకు ఎటువంటి సమస్యలు ఉన్నా చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యం యువతకు ఎటువంటి స్పోర్ట్స్ వస్తువులు అవసరం అయినా యువనేత సూర్య గారికి తెలియజేసి నా వంతుగా యువతను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా అని తెలియజేసారు అలాగే మారుమూలా ప్రాంతం అయినా కన్నాయిగూడెం మండలాన్ని యువనేత కుంజా గారు దత్తతు తీసుకోని యువతని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాడమే తమ కృషి పట్టుదల అని తెలియజేసారు….
ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం మండల యూత్ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాందర్ల నర్సింగరావు, మండల యూత్ ఉపాధ్యక్షులు కుమ్మరి వెంకట్, బుట్టాయిగూడెం యూత్ అధ్యక్షులు జనగాం వసంత రావు, బుట్టాయిగూడెం వార్డు మెంబెర్ మండల యూత్ నాయకులు కుమ్మరి కుమార్, మండల యూత్ నాయకులు జాడి నరేష్, బుట్టాయిగూడెం సీనియర్ నాయకులు జనగాం వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు
