సుమతిరెడ్డి కాలేజ్ లో శ్రీథమ్ 2k-26
హన్మకొండ: నేటిధాత్రి
హన్మకొండ అనంతసాగర్ లోని సుమతి రెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి సంవత్సరం నిర్వహించే సంస్కృతిక ఉత్సవంలో లలో భాగంగా నిర్వహించే శ్రీథమ్ 2k-26 ఈనెల 26,27 తేదీలలో నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశ్రీ రెడ్డి తెలిపారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజశ్రీ రెడ్డి మాట్లాడుతూ..ఈ వేడుకల్లో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సంగీతం, నృత్యం, సాహిత్యం, నాటకం, ఫ్యాషన్ వంటి విభాగాల్లో యువతను ప్రోత్సహిస్తామన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, సంస్కృతిక అవగాహన పెంపొందించడమే ఈ వేడుకల ప్రధాన లక్ష్యమని అన్నారు. రెండో రోజు ప్రముఖ గాయకుడు కశ్యప్ తన అద్భుతమైన గాన ప్రదర్శనతో అలరిస్తారని, దానితోపాటు పఖ్యాత లైవ్ మ్యూజిక్ గ్రూపు వారితో అద్భుత సంగీతంతో వేదిక పైన అందించను అందించనున్నట్లు తెలిపారు.
