హసన్ పర్తి / నేటి ధాత్రి
హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం మల్లారెడ్డి పల్లి గ్రామంలో కేతవరపు ప్రభాకర్ అనే రైతు కుటుంబానికి చెందిన వారి మొక్కజొన్న, మరియు వరి పంటలపై గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందుతో స్ప్రే చేశారు. దీంతో వారి మొక్కజొన్న వరీ పంటలు ఎండి పోయాయని వారు రోదిస్తున్నారు. చేతికి వచ్చిన పంటను గడ్డి మందుతో స్ప్రే చేసి పంటలను నాశనం చేశారని ఎంతో పెట్టుబడి పెట్టి కష్టపడి సాగు చేసుకుంటే మా మీద ఇలా కక్షతో మమ్మల్ని నష్టం చేస్తున్నారని వాపోయారు. ఈ సందర్భంగా వారు పోలీసులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకున్నారు తమకు వారి బంధువులపై అనుమానం ఉందని వ్యక్తం చేశారు తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు.