పిచ్చయ్య పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎర్రబెల్లి రాఘవరావు
పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్ తండ్రి (కోతి) పిచ్చయ్య వారి స్వగ్రామం మల్లంపల్లి గ్రామంలోని వారి ఇంటి వద్ద అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడకండ్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు వారి ఇంటికి వెళ్లి మృతుడి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట పాలకుర్తి మండల మాజీ ఎంపీపీ కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, శాతపురం గ్రామ మాజీ సర్పంచ్ పసులాది సుశీల వెంకటేష్, మండల సీనియర్ నాయకులు లోనే శ్రీనివాస్, లక్ష్మీనారాయణ పురం మాజీ సర్పంచ్ బండి పెళ్లి మనేమ్మ, తదితరులు పాల్గొన్నారు.