మందమర్రి, నేటిధాత్రి:-
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి దోహదపడతాయని అధికారులు తెలిపారు. ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం 17 సంవత్సరాల లోపు క్రీడాకారులకు 3వ ఉమ్మడి ఆదిలాబాద్ హ్యాండ్ బాల్ స్కూల్ లీగ్ 2023 పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రీడలకు బాలికలు 15 జట్లు, బాలురు 10 జట్లు మొత్తంగా 250 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి దోహదపడతాయని బాల్యం నుండే పిల్లలు క్రీడలను జీవితంలో భాగంగా ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, హ్యాండ్ బాల్ స్టేట్ ప్రెసిడెంట్ గోన శ్యాంసుందర్ రావు, అసోసియేషన్ సెక్రెటరీ కనపర్తి రమేష్, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.