జగిత్యాల నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్న పేట గ్రామంలో ఈ నెల 18 తేదీ నుండి జరిగే శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన జగిత్యాల డి.ఎస్.పి వెంకటస్వామి ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, గ్రామంలోని ప్రధాన కూడలిలో, గుడి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అలాగే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా గ్రామానికి నాలుగు వైపులా పార్కింగ్ సదుపాయం కల్పించాలని ఆలయ కమిటీ వారికి సూచించారు. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామిని దర్శించు కున్న జగిత్యాల డి.ఎస్.పి వెంకటస్వామినీ ఆలయ ఛైర్మన్ కొండూరి శాంతాయ్య గుడి ఈఓ విక్రమ్ గుడి పూజారి రాజేందర్ శర్మ సత్కరించారు,ఈ కార్యక్రమంలో ధర్మపురి సిఐ రమణమూర్తి ఎస్సై దత్తాద్రి గొల్లపల్లి ఎస్సై నరేష్ కానిస్టేబుల్ వేణు మరియు సిబ్బంది గ్రామ సర్పంచ్ సిద్దంకి నర్సయ్య,ఉప సర్పంచ్ బేరా కిషోర్, సిద్దంకి మల్లారెడ్డి,బండిదేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
