క్రీడలతో మనసికొల్లసానికి దోహదం : వార్డు సభ్యులు గాబ్రియల్..

క్రీడలతో మనసికొల్లసానికి దోహదం : వార్డు సభ్యులు గాబ్రియల్

◆-: మెజెస్టిక్ క్రికెట్ టౌర్ని సీజన్.8 విజేతగా దిగ్వాల్ జట్టు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్. గత వారం రోజులుగా కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామంలో అత్యంత ఉత్సాహంగా సాగిన ‘మెజెస్టిక్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్-8 మంగళవారం నాడు ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ టోర్నీలో ఫైనల్ విజేతగా దిగ్వాల్ నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 40 గ్రామాల జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటాయి. సెమీఫైనల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన దిగ్వాల్ మరియు రంజోల్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి క్రీడాభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మైదానం అంతా ఈలలు, కేకలతో మార్మోగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో రంజోల్ జట్టుపై దిగ్వాల్ జట్టు ఘనవిజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో దిగ్వాల్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు మరియు గ్రామ పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజేతలకు ట్రోఫీలను అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యం వెలుగులోకి వస్తుందని
దిగ్వాల్ గ్రామ 10వ వార్డు సభ్యులు గాబ్రియేల్ పేర్కొన్నారు. టోర్నీని విజయవంతంగా నిర్వహించిన ఆర్గనైజర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఓటమిని దిగమింగుకుని క్రీడా స్ఫూర్తిని చాటిన రంజోల్ జట్టును కూడా వారు కొనియాడారు. చివరగా, టోర్నీలో పాల్గొన్న 40 గ్రామాల ఆటగాళ్లకు మరియు నిర్వహణ కమిటీ షారుక్, మోసిన్, నర్సిములు, ఖయ్యాం లను అభినందించారు గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version