ఆస్తా స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుడీకే.అరుణ
జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన మహబూబ్ నగర్ రైల్వేస్టేషన్ పరిసరాలు.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
రామరాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనని పిలుపు నిచ్చారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ. గురువారం మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో తమ పార్లమెంట్ పరిధి నుంచి 1400 మంది రామ భక్తులతో అయోధ్య రామ మందిర దర్శనానికి వెళ్తున్న అస్తా స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రామ భక్తులతో మాట్లాడి క్షేమంగా దర్శనం చేసుకొని రావాలని సూచించారు.
హోరేత్తిన జై శ్రీరామ్ నినాదాలు.
అయోధ్య దర్శనానికి వెళ్తున్న ఆస్తా ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ ప్రారంభించిన సందర్బంగా మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో జై శ్రీరామ్ నినాదాలతో మర్మోగాయి.
భక్తులకోసం భోజనం పాకెట్స్ పంపిణి
మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధి నుంచి అయోధ్యకు వెళ్తున్న రామ భక్తులకు భోజనం ప్యాకెట్ అరేంజ్ చేశారు డీకే అరుణ. అయోధ్య రామయ్య దర్శనం కోసం వెళ్తున్న వారికోసం తన వంతుగా ఈ ఏర్పాట్లు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
డీకే.అరుణమ్మ కామెంట్స్
అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో దేశంలో లోని లక్షలాది మంది రామ భక్తుల చీరకాల కల నెరవేరింది
మహబూబ్ నగర్ నుంచి అయోధ్య రామయ్య దర్శనానికి ఇది తొలి స్పెషల్ రైలు
చాలా మంది భక్తులు అయోధ్య దర్శనానికి వెళ్లేందుకు ఆశ పడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మరో రెండు రైళ్లు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాను.
రామ భక్తులు సంతోషంగా దర్శనం చేసుకుని తిరిగొచ్చేలా.. ట్రైన్స్ లో భోజనం, వసతి ఏర్పాట్లు చేశాము
ప్రతి కంపార్ట్మెంట్ కు ఒక ఇంచార్జ్ ని కూడా ఏర్పాటు నియమించాం
రామ భక్తులు అందరు సంతోషంగా దర్శనం చేసుకొని రావాలి అని సూచించారు.