పరకాల నేటిధాత్రి
కాకతీయ కళా తోరణం రాచరిక పోకడలకు నిదర్శనం అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని ఓరుగల్లు ప్రజలకు క్షమాపణ చెప్పాలని వరంగల్ తూర్పు కాంటెస్టెంట్ ఎమ్మెల్యే ఎదులపురం కార్తీక్ అన్నారు.కాకతీయ కళాతోరణం తెలంగాణ ప్రజల, మరీ ముఖ్యంగా ఓరుగల్లు ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక అని, ఓరుగల్లు ప్రజల అస్తిత్వాన్ని, గౌరవాన్ని దెబ్బ తియ్యాలని చూస్తే ప్రజలు ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బేషరుతుగా ఓరుగల్లు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి, అసెంబ్లీ రికార్డ్ ల నుండి ఆ పదాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
లేని పక్షంలో,మీకు పట్టం కట్టిన ఈ ఓరుగల్లు ప్రజలే మీ పతానికి నాంది పలుకుతారని హెచ్చరించారు.పోరాటస్ఫూర్తికి,చైతన్యానికి,తిరుగుబాటుకు కేంద్రమైన ఓరుగల్లు ప్రజల మనోభావాలతో చెలగాటలు ఆడవద్దని అన్నారు.తన మాటలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలు చేస్తామని ఎదులాపురం కార్తీక్ అన్నారు.
