మన బస్తి, మన బిఎల్ఆర్ కార్యక్రమానికి విశేష స్పందన…

ప్రజల్లో బిఎల్ఆర్ కు పెరుగుతున్న మద్దతు..
ఉప్పల్ లో గెలిచేది నేనే అంటున్న బిఎల్ఆర్…

ఉప్పల్
16 నవంబర్ (నేటీధాత్రి):

ఉప్పల్ నియోజకవర్గం,ఉప్పల్ డివిజన్ ఓల్డ్ భరత్ నగర్,కుమ్మరి బస్తి నాచారం డివిజన్ ఎఱ్ఱకుంటలో గురువారం నిర్వహించిన మన బస్తి మన బిఎల్ఆర్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బిఎల్ఆర్ పేర్కొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎన్నికల ఇంఛార్జి రావుల శ్రీధర్ రెడ్డి,సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మా రెడ్డి హాసరవ్వడం జరిగింది.ఈ సందర్భంగా రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గత పదేళ్లలో,60 ఏళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కుతుందని అన్నారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు అడుగడుగున సంక్షేమ పథకాల రూపంలో అండగా నిలిచి,బడులు, గుడులు, దవాఖానాలను నిర్మించి ప్రజలకు తోడుగా ఉన్న పార్టీ బిఆర్ఎస్ నే అని అన్నారు. మూడోసారి కూడా కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టి, సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అరటికాయలు భాస్కర్, సంతోష్ రెడ్డి, నాచారం కార్పొరేటర్ శ్రీమతి శాంతి, సీనియర్ నాయకులు సాయిజెన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version