‘‘నేటిధాత్రి’’ ‘‘డి-ఐటి’’ అసలు విషయం వెలుగులోకి తెచ్చింది.
సోమేష్ మేసేశాడు! లోకేష్ క్యాష్ చేసుకున్నాడు!!
`ఆ ఇద్దరూ బరితెగించి భూములను చెరపట్టించారు.
`‘‘సీతారామయ్య’’కు లడ్డూ చేతిలో పెట్టినట్లు పెట్టారు.
`‘‘3 వేల కోట్ల’’ భూమి సింపుల్‌గా ఇచ్చారు.
`హడావుడిగా కానిచ్చారు…తప్పుడు నెంబర్ కోట్ చేశారు.
`అడ్డంగా దొరికిపోయారు.
`కరీంనగర్ ‘‘వెంకటస్వామి’’ పేరు షేక్ పేట భూమిలోకి ఎందుకొచ్చింది?
`జిల్లాలు దాటి నెంబర్లు ధరఖాస్తు నెంబర్ షేక్ పేటకు వచ్చిందా!
`అసలు కోర్టు ఆర్డర్లో వున్న నెంబర్ ఏమిటి?
`సోమేష్ మార్చిన నెంబర్ ఏమిటి?
`ఎవరూ పట్టించుకోరన్న విచ్చలవిడి తనమా!
`దీనిపై విచారణ చేస్తే ఇలాంటివి ఎన్ని చేసి వుంటారో బైటకొస్తాయి.
`అధికారం చేతిలో వుంది కదా..అని అడ్డగోలు సంపాదనకు ఎగబడ్డారు.
`ప్రభుత్వం తరుపున ‘‘సోమేష్’’ ఆర్డర్ ఇచ్చారు.
`దానికి జిహెచ్‌ఎంసి నుంచి ‘‘లోకేష్’’ మంజూరు చేశారు.
`తెలంగాణ భూములు కొల్లగొట్టే వారికి సహకరించారు.
`‘‘మూడు వేల కోట్ల’’ ప్రభుత్వ భూమి అప్పనంగా దోచి పెట్టారు.
`భూములు మాయం చేయడమే పనిగా పెట్టుకున్నారు.
`‘‘మూడు వేల కోట్ల’’ ప్రభుత్వ భూమి అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు చేశారు.
`అధికారం సాక్షిగా అప్పనంగా ‘‘సీతారామయ్య’’కు కానుక చేశారు.
`హైకోర్టులో కరీంనగర్ వాసి వేసిన పిటిషన్ నెంబరు షేక్ పేటకు జోడిరచారు.
`ఆ రైతు నెంబరు తెచ్చి ఈ భూమికి తగిలించారు.
`అదే హైకోర్టు ఆర్డర్ అని నమ్మించారు.
`దాని మీదనే వెంచర్‌కు అనుమతులిచ్చారు.
`రియల్ మాఫియాతో ఈ ఇద్దరూ చేతులు కలిపారు.
`షేక్ పేట భూమి అసలు ఆధారాలను సేకరించింది.
`‘‘సోమేష్’’, ‘‘లోకేష్’’ అసలు భండారం బయటపడిరది.
హైదరాబాద్,నేటిధాత్రి:
పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా కొరిగిందని సామెత. గత ప్రభత్వ హయాంలో ఉన్నతాధికారి పోస్టు గెలగబెట్టి, రిటైర్ అయిన తర్వాత సలహాదారుడుగా పదవిని అనుభవించిన సోమేష్ కుమార్‌పై అనేక ఆరోపణలున్నాయి. అప్పట్లోనే ప్రస్తుతం మంత్రిగా వున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపిగా వున్న సమయంలో నేరుగా సోమేష్ కుమార్ మీద విమర్శలు చేసిన సందర్బాలు అనేకం వున్నాయి. ఆఫీస్‌లో వుండాల్సిన సోమేష్ కుమార్ ఎప్పుడు చూసినా ఔటర్ రింగ్‌రోడ్డులో ఎప్పుడూ ఏదో ఒక చోట కనపడుతున్నాడు. పెద్దఎత్తున భూములు సంపాదించుకుంటున్నాడని నేరుగానే మంత్రి వెంకటరెడ్డి అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు. అవి నిజమే అన్నట్లు ఇప్పుడు షేక్ పేటలో ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పరిశీలించి చూస్తే ఆనాడు వెంకటరెడ్డి చెప్పింది నూరు పాళ్లు నిజమే అని చెప్పకతప్పదు. ప్రభుత్వ భూములును కొల్లగొట్టేవారికి దగ్గరుండి అప్పనంగా అప్పగించినట్లు ఓ భూమి విషయాలో ఆధారాలున్నాయి. తాను తప్పు చేయడమే కాకుండా, తన అధికారంతో కింది స్ధాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకున్న దాఖలాలున్నాయి. పై స్ధాయి వారికి వాటాలు పంచి, కింది స్ధాయి అధికారులను బెదిరించి పనులు చేయించుకున్నారన్న వాస్తవాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అందులో ఒకటైన 327 ఫైకి అనే సర్వే నెంబర్ భూమిని అడ్డంగా దోచేవారికి సోమేష్ కుమార్ లడ్డూ చెతిలో పెట్టినట్లు కనిపిస్తోంది. షేక్ పేటలో 327పైకిగా ధరణిలో కూడా లేని ఓ నెంబర్‌ను తెరమీదకు తెచ్చి, ప్రభుత్వ భూమిని సీతారాయమ్య అనే ఓ వ్యక్తికి దారాదత్తం చేశారు. పాలకులు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ప్రభుత్వ భూములు అమ్మడం ఆనావాయితీ వస్తుంది. ఖరీదైన భూములు అమ్మి వచ్చిన వాటితో ప్రభుత్వం ఖజానాలో వేసుకుంటుంది. ఇది ఒక భాగం. కాని షేక్ పేటలో సుమారు 3వేల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికి తెలియకుండా మాయం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చేందుకు ఎంత యంత్రాంగం అవసరమో! వాళ్లందరినీ సోమేష్ కుమార్ బెదిరించి, సీతారామయ్య అనే వ్యక్తి పేర రికార్డులు సృష్టించారు. రియల్ వ్యాపారానికి అండగా నిలిచారు. అసలు సీతారామయ్య అనే వ్యక్తికి అంత ఖరీదైన భూమిని ఎలా అప్పగించారు? ఎందుకు అప్పగించారు?
సీతారామయ్య అనే వ్యక్తి సోమేష్‌కుమార్‌కు బినామీయా? లేక సోమేశ్ కుమార్ బేరం కుదుర్చుకొని సీతారామయ్య పేర భూమిని రాసిచ్చారా? అన్నది తేలాల్సి వుంది.
ఒక ఉన్నతాధికారి ఒక సామాన్య వ్యక్తికి షేక్ పేటలో 30 ఎకరాల భూమిని ఉత్తపుణ్యానికి అప్పగించారంటే ఎవరూ నమ్మరు? అందులో ఏదో మతలబు వుంది. అది గత పాలకుల చలవతో చేశారా? గత పాలక పెద్దల అనుంగులకు చేశారా? అసలు గత పాలకులకు ఈ సంగతి తెలిసి చేశారా? ఆవు చేలో మేస్తే దూగ గట్టున మేస్తుందా? అన్నట్లు గత బిఆర్‌ఎస్ పెద్దలు చేసిన భూమాయాలు అనేకం వున్నాయి. అనేకం వెలుగులోకి వచ్చాయి. వాటికి సహకరించినందుకు సోమేష్ కుమార్ ఇదంతా చేశారా? అందుకు జిహెచ్‌ఎంసి అప్పటి కమీషనర్ లోకేశ్‌కుమార్‌తో కలిసి ఇదంతా చేశారన్నది స్పష్టమౌతోంది. అయితే ముప్పై ఎకరాల్లో ఇద్దరూ వాటాలు పంచుకున్నారా? లేక సీతారామయ్యను ముందు పెట్టి వ్యాపారం చేస్తున్నారా? ఒక ప్రైవేటు వ్యక్తికి ఎలాంటి లాభం లేకుండా ముప్పై ఎకరాలు చీకటి ఒప్పందం చేయడం అన్నది మామూలు విషయం కాదు. అసలు తెలంగాణలో మళ్లీ బిఆర్‌ఎస్సే వస్తుందన్న బలమైన నమ్మకం వారి చేత ఇలాంటి తప్పుడు పనులు చేసేందుకు కారణమైందనేది చూస్తేనే అర్ధమౌతోంది. అయితే ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడమే నేరం. అందులోనూ అసలు ఆ భూమికి సంబందించిన సర్వే నెంబరు కాకుండా కొత్త నెంబర్ సృష్టించడం మరో నేరం. దీనిపై ఎలాంటి వివాదాలు లేనట్లు కోర్టు నుంచి ఆర్డర్ కాపీ పేరుతో కరీంనగర్ జిల్లాకు చెందిన వెంకట స్వామి అనే వ్యక్తికి చెందిన డబ్లు.పి.నెంబర్‌తో కథ నడపం మరీ విడ్డూరం. అసలు ఎక్కడి కరీంనగర్. ఎక్కడి షేక్‌పేట. అసలు ఈ భూమితో ఎలాంటి సంబంధం లేని కరీంనగర్‌కు చెందని వెంకటస్వామి అనే వ్యక్తిని పేరుపై వున్న నెంబర్‌తో రియల్ వ్యాపారానికి అనుమతులు ఇవ్వడం అంటే తెలంగాణ సొమ్మును ఎలా దిగమింగారో అర్ధం చేసుకోవచ్చు.
అసలు విషయం ఏమిటంటే కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వెంకట స్వామి అనే వ్యక్తి
తన రెండు ఎకరాల భూమికి స్ధానిక అధికారుల చుట్టూ ఎంత తిరిగినా తనకు పట్టాదారు పుస్తకాలు ఇవ్వడం లేదని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ధరఖాస్తుకు కోర్టు ఓ నెంబర్ ఇచ్చి, కేసును టేకప్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ కేసు ఇంకా పూర్తి కాలేదు. వెంకటస్వామికి పట్టాదారు పుస్తకాలు రాలేదు. ఆ కేసు కోర్టులో ఇంకా నడుస్తూనే వుంది. అయితే ఆ భూమికి చెందిన ఫైల్ నెంబర్‌ను ఎంతో తెలివిగా సోమేష్‌కుమార్, షేక్‌పేటకు చెందిన భూమికి జోడిరచి, కోర్టు నుంచి అనుమతి వచ్చినట్లు ఆదేశాలు జారీ చేశారు. అదే విషయాన్ని ఉటంకిస్తూ అప్పటి జిహెచ్‌ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్ రియల్ వెంచర్‌కు అనుమతలు మంజూరు చేశారు. సీతారామయ్య వ్యాపారం మొదలు పెట్టారు. ప్లాట్లు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. షేక్ పేటలో గజం ధర ఎంత లేదన్నా కనీసం రూ.2లక్షలకు పైగానే వుంది. ముప్పై ఎకరాలను వెంచర్ చేసి అమ్ముకుంటున్నారు. అసలు వారిది కాని భూమి. ప్రభుత్వ భూమి. ప్రభుత్వ పెద్దలే రూపాయి ఖర్చు లేకుండా దారాదత్తం చేశారు. సీతారామయ్య వ్యాపారానికి అండగా నిలిచారు. అయితే కరీంనగర్‌కు చెందిన ఓ రైతు పేరు కేసు ఫైల్ నెంబర్‌ను, హైకోర్డు ఆర్డర్‌గా షేక్‌పేట స్ధలానికి జోడిరచి అప్పనంగా భూమిని కట్టబెట్టారంటే ఎంత ఆరితేరిపోతే గాని ఇలాంటివి చేయలేరు. ప్రభుత్వం దీనిపై తక్షణం దృష్టిపెడితే అసలు విషయాలు బైటకొస్తాయి. ఈ భూమి వెనక వున్న ఈ ఇద్దరు అధికారులతోపాటు, నాటి పాలక పెద్దలు ఎవరున్నారో కూడా వెలుగులోకి వస్తుంది. ఇలాంటి భూ సంతర్పణలు ఇంకా ఎన్ని చేశారన్నవి కూడా బైటకొస్తాయి. పదేళ్ల అదికారంలో బిఆర్‌ఎస్ నేతలు కనిపించిన భూములను కబ్జా చేసి, కోట్లకు పడగలెత్తితే, వారికి సహకరించిన సోమేశ్ కుమార్, లోకేశ్ కుమార్ లాంటి వారు కూడా కోట్లు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు వున్నాయి. ఈ భూమి విషయంలో గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రతిపక్షంలో వున్నప్పుడు స్ధానికులు ఈ విషయం చెప్పడం జరిగింది.
ఓసారి రేవంత్‌రెడ్డి కూడా ఆ స్ధల పరిశీలన చేసిన సందర్భం కూడా వుంది.
ఆనాడే సుమారు 2వేల కోట్లు భూమిని ప్రైవేటు పరం ఎలా చేశారంటూ దీనిపై పోరాటం చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల అంతు చూస్తానని కూడా హెచ్చరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారు. దీనిపై దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అసలు షేక్‌పేట భూమికి సంబంధించిన అనుమతులు ఎలా వచ్చాయన్నదానిపై నేటిధాత్రి నిఘా విభాగం కొంత కాలంగా దానిని ఆరా తీసింది. వివరాలు సేకరించింది. హైకోర్టు ఆర్డర్ వుంటే, కరీంనగర్ కు చెందిన వెంకట స్వామి కేసుకు సంబంధించిన నెంబరు ఎందుకు జతచేశారు. అసలు ఈ భూమికి, కరీంనగర్ వాసికి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి నెంబర్‌ను ఎందుకు వెతికి వేశారు. అమాయకుడైన వెంకటస్వామి ఈ వివాదంలో ఇరుక్కుంటే బాధ్యులెవరు? ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉత్పన్నమౌతాయి. ఇలా భూములను ప్రైవేటు వ్యక్తుల పేర, రాసిచ్చి వారి వ్యాపారానికి అనుమతులిచ్చిన సోమేశ్, లోకేశ్‌లపై కేసు నమోదు చేసి, ఆ భూమి మీద విజిలెన్స్ ఎంక్వౌరీ చేయిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ అన్యాక్రాంతం చేశారన్నవి కూడా తెలిసే అవకాశం వుంది. లేకుంటే అమాయకులు షేక్‌పేటలో కోట్లాది రూపాయలు పెట్టి స్థలాలు కొంటే భవిష్యత్తులో నిండా మునిగిపోయే ప్రమాదముంది.