ఏఐటీయూసీ గెలిచిన గుర్తింపు పత్రం ఇవ్వని యాజమాన్యం
సింగరేణి ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పోరాటం..
ఎఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, కోరిమి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
సింగరేణిలో మునుపేన్నడు లేని విధంగా రాజకీయ జోక్యం అవినీతి తారాస్థాయికి చేరుకుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ లోని ఇల్లందు క్లబ్ హౌస్ లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ లో ఏఐటీయూసీ ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్ష , ప్రధాన కార్యదర్శి లు మాట్లాడుతూ సింగరేణిలో అవినీతి రహిత పాలన కోరుకొని ఏఐటీయూసీని కార్మికులు గుర్తింపు సంఘం గా గెలిపించాలని తెలిపారు.. గత పాలకుల రాజకీయ జోక్యంతో కార్మిక సంఘాలే యాజమాన్యానికి బ్రోకర్లుగా ఏర్పాటు చేసి మెడికల్ దందా నిర్వహించారని విమర్శించారు. సింగరేణి లో నూతన గనులు వస్తేనే భవిష్యత్తు మనుగడ ఉంటుందని కొత్త బావుల ఏర్పాటు కోసం ఏఐటీయూసీ అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. అట్లాగే సింగరేణిలో సింగరేణి తాడిచెర్ల ఓ సీ2 ఇల్లందు కోయగూడెం ఓసి త్రీ, సత్తుపల్లి శ్రావణిపల్లి కేకే 6 ఇంక్లైన్ బావులను సింగరేణి ఆధ్వర్యంలో బొగ్గు తీయాలని గుర్తింపు సంఘంగా యాజమాన్యాన్ని కోరడం జరిగిందని త్వరలోనే ఈ నూతన బావులు ఏర్పాటు అవుతాయని దీంతో మరో 50 ఏళ్లు సింగరేణి డోకా ఉండదని అన్నారు. సింగరేణిలో క్లరికల్ ఉద్యోగాలు ఇంటర్నల్ సింగరేణిలో పనిచేసే విద్యావంతులకే ఇవ్వాలని దానికోసం 360 పోస్టులు 15 రోజులలో నోటిఫికేషన్ రాబోతుందని తెలిపారు. గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిచి సుమారు మూడు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు సింగరేణి యాజమాన్యం రాజకీయాలు చేస్తూ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరుతో గుర్తింపు సంఘం పత్రం కూడా ఇవ్వడం లేదని అన్నారు. దీంతో స్ట్రక్చర్ మీటింగ్ లు జరగక కార్మిక సమస్యలు పరిష్కారానికి నోస్కోలేదు తెలిపారు. సింగరేణి పాఠశాలలో సిబిఎస్ సిలబస్ అమలు చేసే విధంగా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. సింగరేణిలో జరిగే మెడికల్ అవినీతిని అరికట్టేందుకు, దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన ప్రతి కార్మికుని కొడుకులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఆ దిశగా యాజమాన్య దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మిరియాల రంగయ్య, బ్రాంచ్ సెక్రటరీ మోట పలుకుల రమేష్, మాతంగి రామచందర్ గురుజేపల్లి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.