పరకాల నేటిధాత్రి
సోమవారం రోజున హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టెన్త్ టాలెంట్ టెస్ట్ శారద స్కూల్, గర్ల్స్ హై స్కూల్ చైతన్య స్కూల్ లల్లో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మాట్లాడుతూ ఈ టెన్త్ టాలెంట్ టెస్ట్ విద్యార్థుల్లో బోర్డ్ ఎగ్జాం పట్ల ఉ ఉన్న భయాన్ని పోగొట్టడానికి అలాగే వారి సృజనాత్మకతను వెలికితీయడానికి ఉపయోగపడుతుందని కావున విద్యార్థులందరూ నిరంతరం చదువుతూ పోరాడు చదువుకై పోరాడు నినాదంతో ముందుకు సాగుతున్న ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్న టెన్త్ టాలెంటేషన్ విజయవంతంగా సాగుతుందన్నారు.ఎస్ఎఫ్ఐ నాయకులు స్టాలిన్ శివ రంజిత్ విద్యార్థులు పాల్గొన్నారు.