మూడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు.

Severe

మూడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మాసాయిపేట్ గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు

నిత్యం గ్రామన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ కార్మికులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో మండల కేంద్రంలో భిక్షాట చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

అన్ని వర్గాల ఉద్యోగులకేమో మొదటి తారీకున జీతాలు, గ్రామపంచాయతీలో చెత్తాచెదారం తీసివేస్తున్న మాపైకెందుకు శీతకన్ను, అని ఆవేదన వ్యక్తం చేస్తున్న పారిశుధ్య కార్మికులు

రామాయంపేట మార్చి 7, నేటి ధాత్రి (మెదక్)

Severe
Severe

మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం రోజున గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు గ్రామంలో తిరుగుతూ భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా జీతాలు లేక ఇంట్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిత్యం గ్రామానికి సేవ చేస్తున్నాం అయినా మమ్మల్ని పట్టించుకునే నాధుడు లేరని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాలకు సంబంధించిన జీతాలు మొదటి తారీకు రోజే వేస్తున్న ప్రభుత్వము నిత్యం గ్రామంలో చెత్తాచెదారం తీసి వేస్తున్న మాకు ఎందుకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు. ఇల్లు గడవాటం కూడా కష్టంగా ఉందని ప్రభుత్వం మా పరిస్థితిని గమనించి తొందరగా జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో నిరసనను ఉద్భుతం చేస్తామని గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, శివ నర్సింలు, కుమారు,మంజుల, యాదిగిరి లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!