విద్యుత్ ఘాతకంతో ఏడు బర్లు మృతి.

సుమారు నాలుగు లక్షల నష్టం, బోరుమన్న రైతులు.

విద్యుత్ శాఖ బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలి గ్రామస్తులు

మహాదేవపూర్- నేటి రాత్రి:

మండలంలోని బెంగుళూరు గ్రామ శివారులో విద్యుత్ ఖాతకానికి గురై ఏడు పాలిచ్చే బర్లు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. సోమవారం రోజున 12 గంటలకు బెంగళూరు గ్రామానికి చెందిన జక్కం బుచ్చమ్మ, ఇనుగురించి మహేష్, గాయ శ్రీనివాస్, కారు మల్లయ్య చల్ల రాజయ్య, లతోపాటు మరో రెండు బర్లు మొత్తం ఏడు పాలిచ్చే బర్లు గ్రామ శివారులోని చేన్లలో మెతమేస్తున్న క్రమంలో విద్యుత్ తీగ తెగి ఉండడంతో బర్లు విద్యుత్ తీగకు తగిలి అక్కడే మృతి చెందడం జరిగింది. మరో రెండు బర్ల రైతుల వివరాలు తెలియాల్సి ఉంది. బెంగళూరు గ్రామంలో బర్రెల నుండి పాలు తీసి విక్రయించి జీవనం కొనసాగించే కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో బర్లు విద్యుత్ ఘూతకానికి బలి అయిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు మృతి చెందిన బర్ల వద్దకు వెళ్లి కన్నీటి పరమతమయ్యారు. మృతి చెందిన బర్ల యజమానులు వీటి నుండి పాలు తీసి విక్రయించి తమ కుటుంబాన్ని పోషించుకునేవారు. ప్రతి బర్రె విలువ 30 నుండి 40 వేల వరకు ఉంటుందని, ఏడు బర్రెల విలువ సుమారు మూడు నుండి నాలుగు లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లి ఉందని, రైతులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ తక్షణమే బాధిత రైతులకు నష్టపరిహారం అందించి వారిని ఆదుకోవాలని బెంగళూరు గ్రామస్తులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *