*అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు
* రూరల్ ఎస్ ఐ మారుతీ
వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామం లో అక్రమ మద్యం ని అమ్ముతున్నాడు అనే సమాచారం మేరకు తనిఖీ చేయగా అక్రమ మద్యం లభించటం తో సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మారుతీ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా మద్యం ని అమ్మినట్టు అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని, ఎన్నికలు సమీపిస్తున్న వేల ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నందున ప్రతీ ఒక్కరు ఎన్నికల నియమావాళిని ఎవరు ఉల్లగించకూడదు అని సూచించారు. మల్లారం గ్రామానికి చెందిన గడ్డం పర్శరాములు అతని ఇంట్లో సోదా చేయగా 7 వేల రూపాయల విలువ గల మద్యం దొరకగా దానిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు తెలిపారు.