బీహార్ కులగణన దేశానికే ఆదర్శం
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని
బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమల్ల కార్తీక్ గౌడ్అన్నారు. బుధవారం చండూరు మున్సిపాలిటీలో బీసీ సంఘం కార్యాలయంలో బీసీ యువజన సంఘం చండూరు మండల అధ్యక్షులు మామిడి రాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశానికి హాజరై వారు మాట్లాడుతూ,
బిహర్ రాష్ట్ర ప్రభుత్వాన్నీ అనుసరించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడ తక్షణమే కులగణన చేపాట్టాలని వీరమల్ల కార్తీక్ గౌడ్ డిమాండ్ చేశారు మొదటిసారి కులగణన చేపట్టిన బిహర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ల
ఆధ్వర్యంలో మొదటిసారిగా 13 కోట్ల జనాభా ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో మొదటిసారిగా కుల ఆధారిత జనగణను నిర్వహించి అధికారికంగా వెల్లడించారు అని వీరమాళ్ళ కార్తీక్ గౌడ్ తెలిపారు . బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నైనా చూసి భారత ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, బీసీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల ఓట్లు కావాలనుకున్న తక్షణమే బీసీ కుల ఆధారిత జనగణను వెంటనే చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
బీసీల జనాభా లెక్కలు లెక్కించకుండా బీసీలను గురించి బిజెపి మాట్లాడిన టిఆర్ఎస్ మాట్లాడిన బీసీలను మభ్యపెట్టడానికే తప్ప, వారు ఏం మాట్లాడినా బీసీల పై చిత్తశుద్ధి లేదనడానికి బీసీ జనగణన నిర్వహించకపోవడమే నిదర్శనం అన్నారు, ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం, బీసీ కులాల లెక్కలు తీయాలని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని బీసీలను ఇంకా ఎన్ని రోజులు మభ్య పెట్టలేరని,బీసీలను మోసం చేయాలని చూస్తే ఈ రెండు పార్టీలకు వచ్చే అసెంబ్లీ ఏన్నికల్లో బీసీలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు బండి గారి శ్రీధర్ గౌడ్, చండూర్ పట్టణ అధ్యక్షులు మధుతదితరులు పాల్గొన్నారు.