ట్రినిటీ హైస్కూల్లో సైన్స్ ఫెయిర్

లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి:

ట్రినిటీ పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎస్సై లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులలో నైపుణ్యతను బయటకు తీసుకురావడానికి ఈ సైన్స్ ఫెయిర్ లు పనిచేస్తాయని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ఇలాంటి సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం వలన విద్యార్థుల్లో మేధాశక్తి బయటపడుతుందని ఆయన తెలిపారు. తాను విద్యార్థి దశలో ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నానని విద్యార్థులకు తెలిపారు. ట్రినిటీ పాఠశాల ప్రిన్సిపాల్ జోసెఫ్ మాట్లాడుతూ ఈ సైన్స్ ఫెయిర్ విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి సైన్స్ ఫెయిర్ ల వలన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు ముందుకెళ్తారని ఆయన అన్నారు. ఈ సైన్స్ ఫెయిర్ లో 900మంది విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ డైరెక్టర్లు డోన్ డొమినిక్, వైఎస్ ప్రిన్సిపాల్ బ్రో రాహుల్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!