ప్రజా సంఘాల నాయకుల డిమాండ్.
మహాముత్తారం నేటి ధాత్రి.
పలిమల మండల కేంద్రంలోని ఇసుక క్వారీలను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది అనంతరం ప్రజాసంఘాల నాయకులు తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ మాట్లాడుతూ పలిమెల మండలంలో పంకన పెద్దంపేట లంకలగడ్డ ఇసుక క్వారీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకను ఇక్కడ ఉపయోగించకుండా పట్టణ ప్రాంతాలకు తరలించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూగ్రబ్బ జలాలను అడుగంటి పోయే విదంగా చేస్తున్నారు ఈ ప్రాంతంలో నివసిస్తున్నా దళిత ఆదివాసీ గిరిజనులకు చెందవలసినటువంటి సంపద పెట్టుబడిదారులు దోచుకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడున్న ఇసుక క్వారిని ఆపించాలి
ఆదివాసీలను పట్టించుకోలేని కేంద్ర ప్రభుత్వం చత్తీస్గడ్ రాష్ట్రంలోని కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఆదివాసీలను నక్సలైట్ల పేరుతోటి ఎన్కౌంటర్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
ఏదైతే గిరిజనులకు చెందవలసినటువంటి అడవి సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడామేన దేశభక్తి అంటే ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకు చెందాలని ఆదివాసీలు అక్కడున్నటువంటి
ప్రజలు అనేక మైనటువంటి పోరాటాలు చేస్తున్నారు
ఆపరేషన్ కంగారును తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు ఇక్కడ ఇసుక క్వారీలను రద్దు చేయకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలు దళితుల తో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు అక్కల బాపు పీక కిరణ్ దయ్యం పోచయ్య స్థానిక ప్రజలు పాల్గొన్నారు.