సామ్ – రాజ్ మళ్లీ దొరికేశారు.. ఈసారి ఎక్కడంటే..
టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారని చాలాకాలంగా టాక్ నడుస్తోంది. ఇద్దరూ చెట్టాపటాలేసుకుని షికార్లు తిరగడం, తరచూ ఫొటోలు షేర్ చేయడంతో ఇద్దరిపై గాసిప్పులు రెట్టింపు అయ్యాయి.
టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత(Samantha), దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj nidimoru) డేటింగ్‌లో ఉన్నారని చాలాకాలంగా టాక్ నడుస్తోంది. ఇద్దరూ చెట్టాపటాలేసుకుని షికార్లు తిరగడం, తరచూ ఫొటోలు షేర్ చేయడంతో ఇద్దరిపై గాసిప్పులు రెట్టింపు అయ్యాయి. తాజాగా వీరిద్దరూ మరోసారి కెమెరా కంటికి చిక్కారు. సామ్, రాజ్ ఒకే కారులో వెళ్తున్న (Dinner Date) వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ప్రాంగణం చూస్తే రెస్టారెంట్‌లా అనిపిస్తోంది. ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. కారులో ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియోతో మరోసారి ఇద్దరూ వార్తల్లో నిలిచారు. రాజ్-డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’లో సమంత నటించారు. ఆ ప్రాజెక్ట్‌కు పని చేస్తున్న తరుణంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని అప్పటి నుంచి డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఎవరెన్ని కామెంట్లు చేసినా ఈ ఇద్దరూ మాత్రం ఎక్కడా స్పందించలేదు. డేటింగ్ వార్తలు వస్తూనే ఉన్నాయి, రాజ్ భార్య శామలీ డే ఎన్నోసార్లు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కామెంట్స్ చేసినా రాజ్, సమంత సైలెంట్‌గా ఉన్నారు. (Samanatha and Raj