అనూస్ స్కూల్ చిన్నారి సహస్ర రెడ్డి రెండువేల నగదు గోల్డ్ మెడల్ కు ఎంపిక.

వనపర్తి నేటి ధాత్రీ :
వనపర్తి జిల్లా కేంద్రంలోని అనూస్ స్కూల్ లో 2వ తరగతి చదువుతున్న జి. సహస్ర రెడ్డి ఇంటర్నేషనల్ పోటీ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 2000 నగదుతో పాటు గోల్డ్ మెడల్ సాధించింది. సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ వారు ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో చిన్న పిల్లలకు నిర్వహించే పోటీ పరీక్షలలో ఆమె మ్యాథమెటిక్స్ లో 40 మార్కులకు గాను 39 మార్కులు సాధించి 1000 నగదు పురస్కారంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో రెండవ ర్యాంకు పొంది సిల్వర్ మెడల్ సాధించింది. అలాగే సైన్స్ లో 40 మార్కులకు గాను 33 మార్కులు సాధించి అంతర్జాతీయ స్థాయిలో 50 రీజినల్ స్థాయిలో 47 వ ర్యాంకు జోనల్ స్థాయిలో 37 వ ర్యాంకు పాఠశాల స్థాయిలో 4వ ర్యాంకు సాధించి గోల్డ్ మెడల్ కు ఎంపికైంది. అలాగే ఇంగ్లీష్ పోటీ పరీక్షలో 40 మార్కులకు గాను 39 మార్కులు సాధించి అంతర్జాతీయ స్థాయిలో నాలుగవ ర్యాంకు రీజినల్ స్థాయిలో నాలుగవ ర్యాంకు జోనల్ స్థాయిలో రెండవ ర్యాంకు సాధించి 1000 నగదు పురస్కారంతోపాటు జోనల్ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ మేరకు పాఠశాల ఉపాధ్యాయ బృందం చిన్నారి సహస్ర రెడ్డిని అభినందించారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవాన్ని సందర్బంగా నగదు గోల్డ్ సిల్వర్ మెడల్స్ ఇవ్వనున్నట్లు పాఠశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version