పలు సేవా కార్యక్రమాలతో పాటు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన యువసేన సభ్యులు
వరంగల్ తూర్పు 24 జనవరి
తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలను వరంగల్ తూర్పు టిఆర్ఎస్ నాయకులు అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నారు. పోచమ్మేదన్ జంక్షన్ లో బాణాసంచా కాల్చి భారీ కేక్ ను ఏర్పాటు చేశారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజ్ కుమార్ కేక్ కట్ చేసి పండ్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడిగా. నిరుపేద కుటుంబాల పెద్ద కొడుకు గా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలుస్తున్న అభినవ దాన కర్ణుడిగా పేరుగాంచిన వద్దిరాజు రవిచంద్ర గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఆరోగ్యంగా ఆనందంగా శత సంవత్సరాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు బొలుగొడ్డు శ్రీనివాస్. బోల్లికొండ విజయలక్ష్మి. తాండ్ర భాస్కర్. మైనార్టీ నాయకులు ఫక్రుద్దీన్. మరియు రవిచంద్ర యువసేన సభ్యులు ఏరుకొండ వినయ్. నాగపురి రమేష్ గౌడ్. బొల్లోజు శ్రీనివాస్. నానావరపు సందీప్. ఎండి మాస్. సిరిమల్లె కిరణ్. సురేష్.సాయి. మనీ. రబ్బాని షేక్. షారు.ప్రణయ్. బబ్లు. తారక్.నరేష్.సుమన్.తదితరులు పాల్గొన్నారు..
భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు.. యువసేన సభ్యులు..
తెలంగాణ రాష్ట్ర బి ర్ స్ పార్టీ రాజ్యసభ సభ్యులు గౌ “శ్రీ వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు ఉదయం శ్రీ ఓరుగల్లు భద్రకాళి దేవి ఆలయంలో దేవస్థాన ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు మరియు నాగరాజు శర్మ, అరవింద్ శర్మ, అర్చకుల ఆధ్వర్యంలో రవిచంద్ర వ్యక్తిగత సహాయకులు వీణవంక కిరణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు, ముందుగా అమ్మవారికి ప్రత్యేకంగా తీసుకువచ్చిన గజ పూలమాల పుష్పములతో అమ్మవారిని అలంకరించిన అర్చకులు రవిచంద్ర గోత్రనామాలతో పాటు కుంకుమ అర్చన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు,అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు వేద ఆశీర్వచనం అందించారు.ఈ కార్యక్రమంలో యువసేన సభ్యులు నాగపురి రమేష్ గౌడ్. సిరిమల్ల కిరణ్. ఏరుకొండ వినయ్ గౌడ్. సింగారం సంతోష్. అరవింద్ యాదవ్. జనగాం మణికంఠ. బొల్లోజు శ్రీనివాస్. బోళ్ల శ్రీకాంత్.