చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఆరవ వార్డులోని తాజా మాజీ సర్పంచ్ ఇంటిదగ్గర గల వినాయకునికి శనివారం రోజున కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు, మహిళలు యువకులు అత్యంత భక్తిశ్రద్ధలతో గణనాథుని పూజించారు. అలాగే ఈ రోజున 108 రకాల ప్రసాదాలను ఆ దేవునికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కొడగంటి వనజ, లక్ష్మి, సరిత, లత, కొడగంటి తేజస్విని, లత, దేవనపల్లి జ్యోతి, నందిని, రిశ్విత, ఉప్పుల గంగ, గుర్రం దేవేంద్ర, గుర్రం జల, నడిగట్ల వరవ్వ,గీత, బొంబోతుల వరలక్ష్మి, కొడగంటి లక్ష్మి, సంగీత, అడ్డగట్ల దేవేంద్ర , పోతరాజు ఈరవ్వ తదితర మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. రేపటి రోజున అంటే ఆదివారము రోజున ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుందని భక్తులందరూ వచ్చి అన్న ప్రసాద కార్యక్రమము లో పాలుపంచుకోవాలని తెలియజేశారు.
