నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
గతంలోనేర్మట గ్రామానికివిద్యార్థుల కోసం, ప్రజల కోసం వేసిన ఆర్టీసీ బస్సును మళ్లీ పునరుద్ధరించాలని సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. మంగళవారం నల్లగొండ డిపో అసిస్టెంట్ మేనేజర్ హుస్సేన్ కు మా గ్రామానికి ఆర్టిసి బస్సును పునరుద్ధరించాలని కోరుతూవిద్యార్థులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చండూరు మండల పరిధిలోని మారుమూల ప్రాంతాలైన గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనిఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గతంలోఉదయం మాల్ నుండి నేర్మట వచ్చి నల్లగొండకు, మళ్లీ సాయంత్రం నల్లగొండ నుండినేర్మట కు వచ్చి మాల్ కు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేదని, ఆ బస్సును రద్దు చేశారని తక్షణమే ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని ఆయన అన్నారు. బస్సులు నడవకపోతే చండూరు మండల ప్రాంతంలో ఆయా గ్రామాల విద్యార్థులు విద్యకు దూరమై తమ భవిష్యత్తు అందాకారంగా మారుతుందన్నారు. కొంతమందికి బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల మండల కేంద్రంలో ఉండే ప్రభుత్వ విద్యా సంస్థలు కాదని దూర ప్రాంతానికి వెళ్లి చదువుకోవాల్సి పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కొంపెల్లి నాగేశ్వరి, జెర్రిపోతుల స్నేహ, వాణి, మంజులతదితరులు పాల్గొన్నారు.
