నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు.మంగళవారం చండూరులో సిపిఎం మండల కమిటీ సమావేశం సిపిఎం సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీకార్పొరేట్ శక్తుల ఎజెండా అమలుపరుస్తూ,ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారనిఆయన అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.దేశవ్యాప్తంగా కుదిపి వేస్తున్న నీట్ అవకతవకలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతనంగా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ ప్రజా సంక్షేమం కోసం, దేశాభివృద్ధి ద్యేయంగా ఉండాలనిఆయన అన్నారు. కార్మిక,కర్షక హక్కుల కోసం నిరంతరంపనిచేసే విధంగాఆందోళన,పోరాటాలు రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వంఎన్నికల ముందు భూమిలేని పేదలకురూ.12వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామన్న హామీ ఏమయిందని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భూమిలేని పేదలకు, ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన అన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, రెండు లక్షల రుణమాఫీలో ఎలాంటి నిబంధనలు పెట్టకుండా రైతులందరికీ వర్తింపజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలోసిపిఎం మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సిపిఎం మండల నాయకులు కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, రవి, వెంకన్న, స్వామితదితరులు పాల్గొన్నారు.
