గచ్చిబౌలి అభివృద్ధికి రూ. 920 కోట్లు…

గచ్చిబౌలి అభివృద్ధికి రూ. 920 కోట్లు

పదవి ఉన్నా లేకున్నా మీ వెంటే ఉంటా.. గచ్చిబౌలి అభివృద్ధి నా లక్ష్యం: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి*

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి

 

 

గడచిన ఐదు సంవత్సరాల కాలంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలో సుమారు రూ. 920 కోట్లతో రికార్డు స్థాయి అభివృద్ధి పనులు చేపట్టామని గచ్చిబౌలి కార్పొరేటర్ శ్రీ వి. గంగాధర్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం గౌలిదొడ్డిలోని వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన ఐదేళ్ల పాలన నివేదికను ప్రజల ముందుకు ఉంచారు.మౌలిక వసతులు: డివిజన్‌లోని నల్లగండ్ల, గోపన్‌పల్లి, గౌలిదొడ్డి, ఖాజాగుడ వంటి 20కి పైగా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైటింగ్ పనులు 90 శాతానికి పైగా పూర్తి చేశాం. ముఖ్యంగా నల్లగండ్ల డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం.సంక్షేమం: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి పథకాల ద్వారా వందలాది మంది లబ్ధిదారులకు అండగా నిలిచాం.ప్రజా సౌకర్యాలు: గోపన్‌పల్లి తండాలో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, గచ్చిబౌలి స్టేడియం ఆధునీకరణ, పార్కులలో వాకింగ్ ట్రాక్‌లు మరియు శ్మశానవాటికల సుందరీకరణ చేపట్టాం.ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ.. “ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన నేను, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారి సహకారంతో నిధులు తెచ్చి అభివృద్ధికి కృషి చేశాను. ఖాజాగుడ డంపింగ్ యార్డ్ తరలింపు, స్టేడియం మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టాను. పదవి ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యే ఉండి సమస్యల పరిష్కారానికి పోరాడతాను” అని స్పష్టం చేశారు.
​తనకు సహకరించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారికి, జోనల్ కమిషనర్ మరియు ఇతర అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక నేతలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version