ధరూర్ / నేటి ధాత్రి
రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా.. బుధవారం ధరూర్ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు మాట్లాడుతూ…రోడ్డు భద్రత నియమాలను సరిగా పాటించకపోవడం వల్లే తరచుగా రోడ్డు ప్రమాదం జరుగుతున్నాయని అన్నారు. రోడ్డు భద్రత నిబంధనను తప్పనిసరిగా పాటించాలని, ప్రతి వాహనదారుడు ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్, కారు ఇతర ఫోర్ వీలర్ వాహనాలపై వేలేటప్పుడు సీట్ బెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే శిక్షార్హులు అవుతారని, అతివేగం అనర్థానికి దారితీస్తుందన్నారు. ట్రాఫిక్ నిబంధనలను విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. 18 సంవత్సరాలు నిండని మైనర్లు వాహనాలను నడపకూడదని, మేజర్లు మాత్రమే వాహనాలు నడపాలని లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించాలని అతివేగంగా వాహనాలు నడపకుండా ఉండాలని.. ఇది ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులకు వారి కుటుంబ సభ్యులకు విద్యార్థులు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లు భాస్కర్, ఉస్సేన్, ట్రాఫిక్ సిబ్బంది రమేష్ ,రామకృష్ణ పాల్గొన్నారు.